మీసేవ నిర్వాహకుల ఆత్మీయ సమ్మేళనం

మీసేవ నిర్వాహకుల ఆత్మీయ సమ్మేళనం

 సిద్దిపేట జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్ తెలంగాణ

 ఏప్రిల్ 07: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ మెరుగైన సేవలను అందిస్తున్న మీసేవ కేంద్రాల యూజర్ ఛార్జీల పెంపు నిర్వాహకులను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని మీసేవ నిర్వాహకులు చుక్క భరత్, ఎలుక నవీన్, అనంతారం నగేష్, మహేష్, దినేష్ తెలిపారు.
ప్రభుత్వం మీసేవ యూజర్ ఛార్జీలను పెంచిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ బంకెట్ హాల్‌లో మీసేవ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా మేనేజర్ కమటం ఆనంద్ కుమార్, టీజీటీఎస్ జిల్లా మేనేజర్ మారాఠి నరేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారిని మీసేవ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
జిల్లా మేనేజర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, మీసేవ నిర్వాహకులు గత పన్నెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కమీషన్ పెంపు కల నెరవేరిందని తెలిపారు. నిర్వాహకులు ప్రజలకు మరింత చేరువై మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అలాగే నిర్వాహకులు లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.మీసేవ నిర్వాహకులు ఆనంద్, జగన్, అనంతారం నగేష్, భరత్, నవీన్, దినేష్ మాట్లాడుతూ, మీసేవ నిర్వాహకులు ఎలాంటి పొరపాట్లు చేయకపోయినా ఇంటర్నెట్ సేవలలో జరిగిన తప్పులను తమపై మోపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాట్ల అసలు కారణాలను వెలికి తీసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా మీసేవ నిర్వాహకుల కోసం వెల్ఫేర్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని, తమను గ్రూప్-4 ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గత పన్నెండు సంవత్సరాలుగా పెరగని కమీషన్‌ను ప్రభుత్వం ఇప్పుడు పెంచినందుకు ఈఎస్డీ కమీషనర్ రవి కిరణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రమేష్, రఘు, శ్రీకాంత్, తిరుమల, సంగీత, రాధా, మమత, విజయ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!