జడ్చర్ల రూరల్ సీఐగా కే.మహేష్ బాధ్యతల స్వీకారం
నాగార్జున గౌడ్ సీసీఎస్‌కు బదిలీ – శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబాటు
By Ram Reddy
On
మిడ్జిల్ ఏప్రిల్ 7(లోకల్ గైడ్ ):
ఇంతకుముందు జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన నాగార్జున గౌడ్ గారిని పరిపాలనా కారణాలతో మహబూబ్‌నగర్ సీసీఎస్ (Crime and Criminal Tracking System) విభాగానికి బదిలీ చేయడం జరిగినది. ఆయన సేవలను అధికారులు ప్రశంసిస్తూ, కొత్త బాధ్యతల్లో కూడా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
కే.మహేష్ గారు 2012 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సబ్ ఇన్స్పెక్టర్గా సేవలు అందించి ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. 2023 సంవత్సరంలో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన అనంతరం సూర్యాపేట ఎస్‌బీఐ మరియు కొల్లాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించి విశేష అనుభవాన్ని సంపాదించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం వంటి అంశాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు కే.మహేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జడ్చర్ల రూరల్ పరిధిలో శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించాలని, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని, పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచే విధంగా సేవలు అందించాలని సూచనలు చేశారు.
కే.మహేష్ గారు మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జడ్చర్ల రూరల్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడం, నేరాలను అరికట్టడం, యువతను చట్ట విరుద్ధ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Apr 2026 21:11:31
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్ 07 లోకల్ గైడ్
వరంగల్,రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ...
