రైతులు జాగ్రత్తలు పాటించాలి
నల్లగొండ ఉమ్మడి జిల్లా ఫిబ్రవరి 19. (లోకల్ గైడ్).
పురుగుమందుల పిచికారిలో జాగ్రత్తలు పాటించాలని నల్లగొండ మండలం బుద్ధారం గ్రామ సర్పంచ్ టి.వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం గ్రామంలో ఇన్ సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రోడక్ట్ స్టే వార్డ్ షిప్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పంట చేలలో పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం సాయంత్రం వేళల్లో కొట్టాలని, కంపెనీ మందులు, స్ప్రేయర్లు వాడాలని పేర్కొన్నారు. కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు తగు మోతాదులో మాత్రమే పురుగు మందులు పిచికారీ చేసి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని, ఆధునిక పద్ధతుల్లో పంటల సాగు చేస్తున్నప్పటికీ అవగాహన ముఖ్యమని, పూర్తి స్థాయిలో పంటలకు పిచికారీ చేయాలంటే స్ప్రేయర్ పంపులతోనే సాధ్యమని తెలిపారు. పురుగు మందులు పిల్లలకు అందకుండా చూడాలని, ఆహారపదార్థాలకు దూరంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాదయ్య, రిప్రజెంటిటివ్ రవికుమార్, అడ్వయిజర్స్ ప్రశాంత్, మనోజ్ , రైతులు పాల్గొన్నారు.
