బహుజన రాజ్యాధికార యుద్ధభేరి సభను జయప్రదం చేయండి
మాన్యవర్ కాన్సిరాం స్ఫూర్తితో బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేయాలి
భద్రాచలం, లోకల్ గైడ్ :
బీఎస్పీ రాష్ట్ర నాయకుడు కర్రి కృష్ణ
భద్రాచలం పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర నాయకుడు హాజరై ఆయన మాట్లాడుతూ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వివక్షకు గురవుతున్న వర్గాలను ఐక్యం చేసి బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్లి బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేసిన మహోన్నత నాయకుడు మాన్యవర్ కాన్సిరాంమని పేర్కొన్నారు. మార్చి 15వ తేదీన కాన్సిరాం జయంతి సందర్భంగా స్టేషన్ ఘనపూర్‌లో “బహుజన రాజ్యాధికార యుద్ధభేరి సభ” నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాన్సిరాం స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు బహుజన రాజ్యాధికార సాధన కోసం కంకణబద్ధులై పనిచేయాలని కోరారు. సమాజంలో ఎవరు ఎంత ఉన్నారో వారికి అంత వాటా దక్కాలని గొప్ప నినాదంతో, “సర్వజనహితాయ – సర్వజన సుఖాయ” అనే లక్ష్యంతో బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు సాగుతోందన్నారు. బహుజన ఉద్యమం ఎవరికి వ్యతిరేకం కాదని, సమాజంలో సమానత్వం నెలకొల్పడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ పూలే, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుర్రాల దుర్గాభవాని, భద్రాచలం అసెంబ్లీ అధ్యక్షుడు కొండా చరణ్ తదితరులు పాల్గొన్నారు.
