శిశువు తల్లి గర్భంలో ఉండగానే సమస్యల గుర్తింపుతో ప్రాణ రక్షణ
హై రిస్క్ గర్భధారణల్లో ప్రతి నిమిషం విలువైనదే..
By Ram Reddy
On
మెడికవర్ హాస్పిటల్స్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు...వెల్లడి
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మార్చి24 లోకల్ గైడ్
వరంగల్ వంటి జిల్లా
ల్లో హైరిస్క్ గర్భధారణలు ,అకాల ప్రసవాల సందర్భాల్లో సమయానుకూలంగా ప్రత్యేక వైద్యం అందకపోవడం వల్ల తల్లి, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ వైద్య నిపుణులు తెలిపారు. మంగళవారం హనుమకొండ హంటర్ రోడ్ లోని మెడికల్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ నీయోనేటాలజిస్ట్ డా. రవీందర్ రెడ్డి పరిగె, పీడియాట్రిక్ సర్జన్ డా. మధుమోహన్ మాట్లాడుతూ అకాలంగా జన్మించిన శిశువుల జీవన శాతం , వారి దీర్ఘకాలిక అభివృద్ధి ఆధునిక వైద్య సదుపాయాలతో పాటు, సమయానుకూల నిర్ణయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు , విభాగాల మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటాయని వైద్యులు తెలిపారు. 23–24 వారాల్లో జన్మించిన అత్యంత అకాల శిశువులకు ఆధునిక శ్వాస సహాయం, ఇన్ఫెక్షన్ నియంత్రణ, పోషకాహార నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు.హైదరాబాద్‌లోని మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్‌లో అత్యాధునిక ఎన్‌ఐసీయూ (NICU) సదుపాయాలు, 24 గంటల నీయోనేటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ మద్దతు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నాయని తెలిపారు.సాక్ష్యాధారిత చికిత్సా విధానాలు , కఠినమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల ద్వారా అకాల శిశువుల్లో మెరుగైన చికిత్సా ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ అశ్విత తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
24 Mar 2026 18:28:52
నిర్మల్ : లోకల్ గైడ్ :ప్రపంచ నీటి దినోత్సవం- సందర్భంగా వాటర్ అండ్ జెండర్ నేపద్యము తో మామడ మండలము లోని బండల్ ఖానాపూర్ గ్రామంలో
