పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
ప్రజలను ఆదుకోవాలి-అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం
ఐద్వా మహిళా సంఘం నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ.
నల్లగొండ ఉమ్మడి జిల్లా .మార్చి 11 . (లోకల్ గైడ్).
నల్గొండ మండలం జీకే అన్నారం గ్రామంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సహాయ కార్యదర్శి కొండనురాధ మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ మహిళలకు మర్చిపోలేని గొప్ప బహుమతిని ఇచ్చాడన్నారు అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పై దాడులు చేసిన నోరు విప్పని ప్రధానమంత్రి మోడీ దేశాల మధ్య యుద్ధాలు జరిగిన మన దేశానికి ఇబ్బంది లేదని చమురు నిల్వలు ఉన్నాయని భారతీయులు ఆందోళన చెందొద్దని గొప్పలు పలికిన రెండు రోజులు గడవక ముందే మహిళా దినోత్సవం రోజు మహిళలకు కానుకగా వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచారు. మహిళలలు మహారాణులు అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ మహిళల నెత్తిన సిలిండర్ బండతో బాధేస్తున్నారు.ఇప్పటికే సిలిండర్ ధర 950 రూపాయలు పెట్టి కొనలేక పేద మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు గ్యాస్ సబ్సిడీ ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నారు, కానీ ఇంతవరకు కూడా సబ్సిడీ బ్యాంకులో ప్రభుత్వం వేయలేదన్నారు. అది అలా ఉండగా మళ్లీ సిలిండర్ పై 60 రూపాయలు 115 రూపాయలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై అధిక భారాలు మోపింద నీ నిత్యవసర సరుకుల ధరలు పెరిగి పనులు లేక సరుకులు కొనలేక అర్ధాకలితో ప్రజలు అవస్థలు పడుతుంటే బిజెపి ప్రభుత్వం మోడీ పెనం మీద నుండి పోయిలో కి నెట్టి వేసిందన్నారు.నిత్యాసర సరుకులు తగ్గించాలని ఆందోళన చేస్తుంటే మోడీ ప్రభుత్వం పొయ్యి కింద మంటలు పెట్టి మహిళలపై భారాలు మోపింది వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేశారు లేనిచో బిజెపి ప్రభుత్వానికి మహిళలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సుమలత సాలమ్మ జయమ్మ అఖిల ఏందిరా శ్రీదేవి బక్కయ్య లాధరు జంగయ్య నిరంజన్ తదితరులు పాల్గొన్నారు
