వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ. 

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ. 

 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన తిలక్ స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కాంట చౌరస్తా వద్ద ఆదివారం అల్పాహారం పంపిణీ చేశారు.భవన నిర్మాణ కార్మికులకు నిరుపేదలకు కూలీలకు ఆటో డ్రైవర్లకు బాటసారులకు చిరు వ్యాపారస్తులు సుమారు 300 మందికి అల్పాహారం పంపిణీ చేసినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.పెళ్లిరోజు,పుట్టినరోజు,పెద్దల జయంతి,వర్ధంతి లాంటి తదితర కార్యక్రమాలకు కుటుంబ సభ్యుల పెద్దల పేర్లతో పేదలకు అల్పాహారం పంపిణీ చేయవచ్చు అని,దాతలు ముందుకు వచ్చి సేవ కార్యక్రమంలో పాల్గొనాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రంగ రామన్న,కంటెవాడ నాగేష్ కుమార్,రత్నం రాజం,గెల్లి జయరాం యాదవ్,కోడి రమేష్,గంట శ్రీనివాస్,భోగ శ్రీనివాస్,గరిగె రాజ్ కుమార్,ముత్తె వెంకట రాజం,మాదరవెని రాజేందర్,డోలి సుకుమార్,తిప్పారం రాజయ్య,శంకర్ గౌడ్,నరేష్,శ్రీనివాస్,లింగయ్య,సత్తయ్య,నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News