శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రాబోయే ఎన్నికల నేపథ్యంలో కొండాపూర్ కానీ, కొత్తగా ఏర్పడిన వేరే డివిజన్ నుంచి ప్రముఖ బిల్డర్, బీసీ నాయకుడు, మనతవాది, మంచి మనసున్న నాయకుడు బలరాం యాదవ్ కార్పొరేటర్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల ముందుకు వచ్చి తమకు మద్దతుగా ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా బలరాం యాదవ్ మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటూ ప్రజలలో మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు చదువుకు అవసరమైన సదుపాయాలు కల్పించడం, పలు విద్యాసంస్థలకు కుర్చీలు వంటి సామగ్రి అందించడం, అనాధలకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఆయన నిరంతరం ప్రజలకు సేవా కొనసాగిస్తున్నారు. సేవా చేయడం తనకు హాబీగా భావిస్తూ సమాజానికి తన వంతు చేయాలని కృషి చేస్తున్నారు. ప్రాంత అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, యువతకు అవకాశాలు కల్పించడం వంటి లక్ష్యాలతో ఎన్నికలలో పోటీ చేయాలని బలరాం యాదవ్ ప్రకటించారు. ప్రజల ఆశీస్సులు, మద్దతు ఉంటే మరింత సేవ చేయగలనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానికంగా మంచి పేరు సంపాదించిన బలరాం యాదవ్ పోటీ ఎన్నికలలో ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు, ప్రజలతో ఉన్న అనుబంధం ఎన్నికలలో ఎంతవరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సి ఉంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.