ఆర్డీవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ.
రైతులకు త్వరగా ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.
By Ram Reddy
On
జగిత్యాల జిల్లాలో శుక్రవారం రోజున ఆర్డీవో కార్యాలయంను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను రైతులకు త్వరగా ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును శూన్యంగా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని, మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ను మరింత వేగవంతం చేస్తూ అలాగే మ్యాపింగ్ లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, తప్పు ఎంట్రీ లు జరగకుండా ప్రతి ఓటరు మ్యాప్ అయ్యేవిధంగా ప్రతి ఇంటినుండి ఖచ్చితమైన మరియు నిర్ధిష్టమైన వివరాలు సేకరించేలా అన్ని స్థాయి ల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఈ పరిశీలనలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధు సూదన్, తహసీల్దార్ లు రామ్మోహన్, వరందన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
04 Mar 2026 20:53:55
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
