బైరంపల్లిలో ఘనంగా బీరప్ప పండుగ
ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి.
By Ram Reddy
On
మిడ్జిల్ పిబ్రవరి 23(లోకల్ గైడ్):
గ్రామ దేవత బీరప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఎమ్మెల్యే స్వామివారికి మొక్కులు చెల్లించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొని గ్రామస్తులతో కలిసి ఉత్సాహంగా నడిచారు. మహిళలు, యువకులు సంప్రదాయ వేషధారణలో నృత్యాలు ప్రదర్శించి పండుగకు మరింత శోభను చేకూర్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ సంప్రదాయాలు, జాతరలు మన సంస్కృతికి ప్రతీకలని అన్నారు. బీరప్ప పండుగ గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇటువంటి పండుగలు సామాజిక సౌహార్దాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బైరంపల్లి గ్రామంలో రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకొని దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, యువకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
07 Mar 2026 22:06:31
లోకల్ గైడ్/తాండూర్:ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని...
