సామాజిక లైంగిక దోపిడికి గురౌతున్న మహిళల

అసమానతలు పోవాలంటే పోరాటమే మార్గం

సామాజిక లైంగిక దోపిడికి గురౌతున్న మహిళల

ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డీ సీతావక్ష్మి, సీఐటీయూ జిల్లా కవిుటి సభ్యురాలు పాయం రాధాకుమారి

భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :
కనీస వేతనాలు, పని భద్రత లేని కొలువుల్లో అత్యధిక మంది శ్రావిుక మహిళలు పనిచేస్తున్నారని, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, లైంగిక దోపిడికి మహిళలు గురువుతున్నారని, ఈ దోపిడి అసమానతలు పోవాలంటే పోరాటమే మార్గమని, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డీ సీతావక్ష్మి సీఐటీయూ జిల్లా కవిుటి సభ్యురాలు పాయం రాధాకుమారి అన్నారు.  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రావిుక మహిళా సదస్సు సీఐటీయూ మండల నాయకురాలు స్వరూప అధ్యక్షతన నిర్వహించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లకు వేతన భద్రత పని భద్రత కరువైందని, తీవ్రమైన పని భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు ధరల పెరుగుదల మహిళల యొక్క ఆర్థిక సామాజిక ప్రగతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని పేర్కొన్నారు. అత్యాచారాలు, వేధింపులు, హింస పెరిగిపోతుందని, దీని అరికట్టడంలో పాలకవర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, మనువాద సిద్ధాంత భావజాలం మహిళలను తిరోగమన వైపు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలంటే వంటింటికే పరిమితం కావాలని పురుషుని సుఖపెట్టే సాధనంగా ఉండాలని పెట్టుబడిదారీ సమాజం భావిస్తుందని విమర్శించారు. సమాజ ప్రగతికి మనసి సృష్టికి అత్యంత కీలకమైన మహిళను అంగడి సరుకుగా పెట్టుబడిదారీ సమాజం మార్చిందని విమర్శించారు. తమ లాభాల కోసం సరుకుల ప్రచారం కోసం మహిళను  మార్చాలని, ఇది మహిళలను మనిషిగా కాకుండా వ్యాపార ధోరణితో చూసే పెట్టుబడిదారీ విధానపు లక్షణం అని దీనికి వ్యతిరేకంగా సమానత్వం కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం అనేది ఒక వేడుక కాదని, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన పోరాటాల ప్రతీకని పేర్కొన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళలు శ్రామిక మహిళల యొక్క హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మూడు రకాల ఆటల పోటీలు నిర్వహించే విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సదస్సులో రైతు సంఘం మండల కార్యదర్శి మచ్చ రామారావు, ఐద్వా మండల కార్యదర్శి పొడుపుగంటి సమ్మక్క, వార్డు మెంబర్లు వరదాల వరలక్ష్మి, కట్టంస్పందన, గిరిజన సంఘం నాయకులు నరేష్, సీఐటీయూ నాయకులు పాలెం నాగమణి, కమల మనోహర్, రమాదేవి, ఈశ్వరి, నాగమణి ఐద్వా నాయకులు భద్ర, గోపమ్మ తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత. అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
లోకల్ గైడ్/తాండూర్:ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని...
సమాజ అభివృద్ధికి మహిళలు ఆదర్శంగా నిలవాలి 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 
స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
పోస్టర్ తయారీపై విద్యార్థికి ప్రథమ బహుమతి 
ఈనెల 9న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. 
సామాజిక లైంగిక దోపిడికి గురౌతున్న మహిళల