సమాజ అభివృద్ధికి మహిళలు ఆదర్శంగా నిలవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్
By Ram Reddy
On
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, మహిళల అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని అన్నారు. విద్యా వంతురాలైన మహిళ అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకుని ఉన్నత స్థాయికి ఎదగగలదని తెలిపారు. సమాజ పురోగతిలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమని అన్నారు. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిలో చాలా సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేరుమీదే మంజూరు చేయబడుతున్నాయని తెలిపారు. ప్రతి రంగంలో మహిళలు ముందుకు వచ్చి తమ సామర్థ్యాలను నిరూపిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మాట్లాడుతూ* మహిళల పట్ల లింగ వివక్ష తొలగింపు కుటుంబ వ్యవస్థ నుండే ప్రారంభం కావాలని అన్నారు. తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారినప్పుడే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని తెలిపారు. పనిచేసే మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా ఉండేలా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి స్వర్ణలత లేనినా మాట్లాడుతూ, మహిళల సాధికారతకు విద్య, అవగాహన మరియు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని అన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. “బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం ద్వారా బాలికల విద్య, భద్రత మరియు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. ప్రతీ కుటుంబంలో బాలికలకు సమాన అవకాశాలు కల్పించి వారి ప్రతిభను వెలికితీయాల్సిన బాధ్యత సమాజంపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు. అలాగే ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా కార్పొరేటర్లు, సర్పంచులు, ఉప సర్పంచులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, వివిధ శాఖల మహిళా అధికారులు, కార్పొరేటర్లు, మహిళా సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు,మహిళా సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Mar 2026 22:06:31
లోకల్ గైడ్/తాండూర్:ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని...
