రైతు వ్యతిరేక నిర్ణయాలు వెంటనే ఉపసంహరించాలి.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్.
By Ram Reddy
On
మొక్కజొన్న రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా కేశంపేట మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
లోకల్ గైడ్ కేశంపేట్.
ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ రైతుల కష్టాన్ని లెక్కచేయని ఈ ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న రైతుల పెండింగ్ చెల్లింపులు విడుదల చేయాలని, రైతుబంధు నిధులను తక్షణమే జమ చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం నైతిక బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు.
అదే విదంగా రైతు వ్యతిరేక నిర్ణయాలు వెంటనే ఉపసంహరించాలి! రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలి! లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ పీఎసీఎస్ చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
05 Mar 2026 20:11:34
ఖమ్మం: లోకల్ గైడ్)ఆసుపత్రిలో అర్థరాత్రి వెళ్ళినా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పించాలి
వైద్య సిబ్బంది మెరుగైన పని తీరుతో మార్పు సాధ్యం
పాలేరు నియోజకవర్గంలో రెండు...
