స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 

ఇందిరమ్మ ఇల్లుకు స్లాబ్ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు

స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 

 


బెల్లంపల్లి (లోకల్ గైడ్)


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని12వ వార్డు కాల్ టెక్స్ ఏరియాలోని ఖుర్శిద్ ఇందిరమ్మ ఇల్లుకు స్లాబ్ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు నెల్లి రమేష్ హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలు నిజంగా అర్హులైన పేద కుటుంబాలకు ఉపయోగపడేలా నియోజక వర్గంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కృషి చేస్తున్నారని అన్నారు.పేద ప్రజల ఇళ్ల కల సాకారం కావడం తనకు ఎంతో ఆనందాన్ని కల్గిస్తోందని తెలిపారు.12వ వార్డు అభివృద్ధి కొరకు,పేద ప్రజల అవసరాల కోసం నిత్యం ఎల్లవేళల అందుబాటులో ఉండి,సేవ చేస్తానని,ఏ సమస్య వచ్చినా మీ వెంట ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు  శివారపు ఈశ్వరమ్మ,నెల్లి సమ్మన్న,నూనె ప్రభాకర్,శమీం,బస్తి పెద్దలు మాధవరావు,గాండ్ల సత్తయ్య,మూట రమేష్,కట్ల అశోక్,బొల్లు రమేష్,చందనగిరి శ్రావణ్,పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత. అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
లోకల్ గైడ్/తాండూర్:ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని...
సమాజ అభివృద్ధికి మహిళలు ఆదర్శంగా నిలవాలి 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 
స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
పోస్టర్ తయారీపై విద్యార్థికి ప్రథమ బహుమతి 
ఈనెల 9న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. 
సామాజిక లైంగిక దోపిడికి గురౌతున్న మహిళల