నారాయణపేట ఫిబ్రవరి 14:
నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ రచించిన వ్యూహం ఫలించింది.కాంగ్రెస్ వ్యూహం బెడిసి కొట్టింది.దాంతో ఈ ఎన్నికల్లో బిజెపి గతంలో కన్నా ముగ్గురు కౌన్సిలర్లను అధికంగా గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటు దూరంలో ఉంది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కే.శివకుమార్ రెడ్డి ముందు గానే చైర్మెన్ అభ్యర్థిని సరిత బట్టాడ్ ను ప్రకటించి ఎన్నికల కు పోయింది.అయితే కాంగ్రెస్ వ్యూహాన్ని పసిగట్టిన బిజెపి ఎంపీ.డీకే.అరుణ,బిజెపి రాష్ట్ర సీనియర్ నేతలు నాగురావు నామాజీ,కే.రతంగ్ పాండురెడ్డి,జిల్లా బిజెపి అధ్యక్షుడు సత్య యాదవ్ బిజెపి చైర్మెన్ అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది.దాంతో ఒకరి వ్యూహం బెడిసి కొత్తగా మరొకరి వ్యూహం ఫలవంతమైంది.కాంగ్రెస్ పార్టీ చైర్మెన్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో చైర్మెన్ పదవిని ఆశిస్తున్న నాయకులు సదరు అభ్యర్థి అంటే గిట్టని వారు కాంగ్రెస్ పార్టీ చైర్మెన్ అభ్యర్థిని ఓడించడానికి ముందుగానే ప్రణాళికలు రూపొందించి విడగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.కాగా బిజెపి లో చైర్మెన్ పదవిని ఆశిస్తున్న వారు ప్రధానంగా నలుగురు ఉండడంతో ఎవరికి వారు మెజార్టీ కౌన్సిలర్లను గెలిపించుకోవాలని ముమ్మర ప్రయత్నం చేసి గతంలో 9 మంది కౌన్సిలర్ల కన్నా అదనంగా మరో ఇద్దరిని అదనంగా గెలిపించుకున్నారు.దీనిని బట్టి చూస్తే బిజెపి వ్యూహం ఫలించిందని తెలుస్తోంది.కాగా బిజెపి నుంచి 10 వ వార్డులో బిజెపి చైర్మెన్ పదవిని ఆశించిన తాజా మాజీ కౌన్సిలర్ సిద్ది విశాలాక్షి వెంకట్రాములు వలస వచ్చి పోటీ చేయడంతో అవార్డు కార్యకర్తలు ఆగ్రహంతో బి.జయశ్రీ నీ బిజెపి రెబల్ గా పోటీకి దించి విజయం సాధించారు.విజయం సాధించిన జయశ్రీ శనివారం రాత్రికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమక్షంలో తిరిగి బిజెపి లో చేరారు.దాంతో కమలం గుర్తుతో గెలిచిన 11 మంది కౌన్సిలర్ల కు తోడుగా రెబల్ గా గెలిచిన జయశ్రీ బిజెపిలో చేరడంతో బిజెపి బలం 12కు చేరుకుంది.చైర్మెన్ పదవిని దక్కించుకునేందుకు ఒక్క ఓటుకు దూరంగా ఉంది.అయితే ఎంపీ డి కే అరుణ ఎక్స్ అఫిసియో ఓటుతో నారాయణపేట చైర్మెన్ పదవిని సునాయాసంగా దక్కించుకునే పరిస్థితి నెలకొంది.
________________________