రోడ్డెప్పుడు వెస్తారు...! మహాప్రభో...!!

ఇకనైనా రోడ్ల మరమ్మతులు చేయకపోతే బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు తప్పవు

రోడ్డెప్పుడు వెస్తారు...! మహాప్రభో...!!

మండల కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్

భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ నుండి తాలిపేరు ప్రాజెక్టు, సాయిబాబా మందిరంకు, ఏకలవ్య పాఠశాలకు, ప్రభుత్వ కాలేజీకి వేళ్ళే  రోడ్డును ఎప్పుడు వేస్తారు మహాప్రభో అని చర్ల బీఆర్ యస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్ చేశారు. ఈ రోడ్డు కోసం గతంలో 2 సార్లు బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు చేసారని, అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు కాని పట్టించుకునే నాథుడే లేరని, ఈ రోడ్డు 2025 జనవరిలో రూ 1 కోటి 10 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు ముందు అడవుడిగా ఎమ్మెల్యే ఆగస్టులో శంఖుస్తాపన చేసి, ఈ రోడ్డు మంజూరు అయి 2 వ సంవత్సరాల్లో అడుగు పెట్టినా, ఈ రోడ్డు వేయించాలని ఆలోచన మర్చి పోయారని అన్నారు. ఈ రోడ్డు మీద అనేక గిరిజన గ్రామాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారని, కాలేజీ విద్యార్థులు దేవాలయలకు వెళ్లే ప్రజలు లక్ష్మికాలని, దేవనగరం, దోసిల్లపల్లి, పెద్దమిడిసిలేరు, తిప్పాపురం, గ్రామస్తులు ప్రయాణం చేస్తున్నారని, అడుగు గోతులతో పాడై  టూ వీలర్స పై ప్రయాణం చేసే ప్రజలు క్రిందపడి గాయాల పాలవుతున్నారని, ఇది ఇలాగే ఉంటి ప్రాణాపాయం ఉందన్నారు. దీనికి తోడు గ్రావెల్ తోలే లారీల వల్ల ఈ రోడ్డు పాడవుతుందని,  అక్కడ ప్రజలకు రాత్రులు నిద్ర పట్టక  ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా భద్రాచలం నుండి చర్ల ప్రయాణంలో లారీల వలన గోతుల వలన దుమ్ము దూళీతో నిండి పోయిందని, అభివృద్ధి జరకపోగా రోగాలు దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ బాగ అభివృద్ధి చెందాయని అన్నారు. అనేక రోడ్డు ప్రమాదాలు, గత 4 రోజుల క్రితం గోతుల వలన లక్ష్మినగరం వద్దు లారీ కింద పడి ఒక మహిళ మృతి చెందిందని, ఆదివారం రాత్రి శివరాత్రి సందర్భంగా గిరిజన గ్రామాల నుండి వేలమంది తేగడ చర్ల దేవాలయాలను సందర్శిస్తారని, ఈ గోతుల వలన లారీల వల్ల ప్రమాదాలు జరగవచ్చని, ఇకనైనా ఈ రోడ్డు వేయించి, భద్రాచలం నుంచి చర్ల వరకు గోతులు పూడ్పించాలని, లేనియెడల మరోసారి బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేస్తామని తెలిపారు.

Tags:

About The Author

Latest News