ఘనంగా శివ స్వాముల మహా పడిపూజ
వెలుగొముల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం
మిడ్జిల్ ఫిబ్రవరి 14: (లోకల్ గైడ్):
మిడ్జిలు మండల పరిధిలోని వెలుగోముల గ్రామంలో శనివారం ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శివ స్వాముల మహా పడిపూజ కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సమిష్టి సహకారంతో శివ స్వాముల మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఉదయం వేద మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ప్రాంగణం మొత్తం పుష్పాలతో అందంగా అలంకరించబడింది. భక్తులు శివనామస్మరణతో, భజనలతో ఆధ్యాత్మిక వాతావరనం నెలకొన్నది .
శివ స్వాముల మహా పడిపూజలో భాగంగా ప్రత్యేక , అర్చనలు నిర్వహించారు. భక్తులు క్రమశిక్షణతో పూజా కార్యక్రమాలలో పాల్గొని తమ కోరికలను స్వామివారికి సమర్పించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనగా, యువత సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం గ్రామ చెన్నకేశవ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి నాగేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది భక్తులకు రుచికరమైన ప్రసాద విందు ఏర్పాటు చేసి, సేవా భావంతో అన్నదానం చేశారు. అన్నదానంలో భాగంగా అన్నం, పులిహోర, కూరలు, చట్నీలు, స్వీట్లు వడ్డించారు. భక్తులు ఆనందంతో ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు వెంకటేష్ మధు మహేష్ సర్పంచ్ సువర్ణ ఆలయ మాజీ చైర్మన్లు లక్ష్మారెడ్డి విజయజి రవీందర్ రెడ్డి సాయిలు గ్రామస్తులు వీరాజీ పరమేశ్వర్ గౌడ్ పరమేశ్వర్ గారు రామకృష్ణ వెంకటయ్య గౌడ్ శివకుమార్ గౌడ్ జంగయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు
