ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (డైట్) నల్లగొండ యందు స్వపరిపాలన దినోత్సవం
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (డైట్) నల్లగొండ యందు "స్వపరిపాలన" దినోత్సవాన్ని చాలా సంబరంగా, ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠశాల నిర్వహణ చేస్తూ, ఎంతో క్రమశిక్షణాయుతంగా విద్యార్థులకు విద్యాబోధన కార్యక్రమాన్ని నిర్వహించారు.జీవితంలో ఉపాధ్యాయులు కావడం మా ధ్యేయం, మా లక్ష్యం అని విద్యార్థులన్నారు. ఈ ఒక్కరోజు ఉపాధ్యాయ అనుభవం మా జీవితంలో ఎంతో మార్పు తో పాటు మాకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, శనివారం కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన ఎండి అఖిల్ అన్నారు. డీఈవో గా ప్రియాన్సీ, ఎంఈఓ గా మలిహ, ప్రధానోపాధ్యాయులుగా జి మనీశ్వర్ తమ బాధ్యతలను చక్కగా నిర్వహించారు.ఈ పూర్తి కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలే వెంకటయ్య
పర్యవేక్షణ చేయగా ఉపాధ్యాయులు పి. ఝాన్సీ లక్ష్మీ, పి. వెంకటేశ్వర్లు, నసీమా బేగం , షాజియా తబస్సుమ్ , మేకల ప్రశాంతి , మాండ్ర శివప్రసాద్ , తదితరులు కార్యక్రమాన్ని దివ్యంగా నడిపించారు.
