ఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాలి – బీ ఎస్ పీ భద్రాచలం అసెంబ్లీ అధ్యక్షులు భాషా

ఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

 

 

దుమ్ముగూడెం : లోకల్ గైడ్ :
ములకపాడు గ్రామంలో ఈ రోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి భద్రాచలం అసెంబ్లీ అధ్యక్షులు జహురుద్దీన్ భాషా గారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాషా మాట్లాడుతూ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ అంటే చదువు, జ్ఞానం, కుల నిర్మూలనకు ఆయుధం, నిలువెత్తు ఆత్మగౌరవం, సర్వ సమాన హక్కులు, ఓటు హక్కు, బహుజన రాజ్యాధికారం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తూ ముందుకు సాగాలని, మహనీయుడి సిద్ధాంతాలను మరువకూడదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల ఇంచార్జ్ జక్కా వెంకట్, మండల అధ్యక్షులు కొండా ప్రమోద్, భద్రాచలం పట్టణ అధ్యక్షులు మైనం ఉమా మహేశ్వర రావు, చర్ల మండల ఈసీ సభ్యురాలు చిట్టిమల్ల సుజాత, దుమ్ముగూడెం మండల సోషల్ మీడియా ఇంచార్జ్ రాయిపూడి సంపత్ (మారి), కమిటీ సభ్యులు కాలవ ప్రశాంత్, పొందీ రోహిత్, కొప్పుల జయసింహా తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News