నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మాత్రమే ప్రభుత్వ
బడులలో నమోదు పెరుగుతుంది
జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఏప్రిల్ 09 :
కారేపల్లి మండలంలో గురువారం నాడు అకాడమిక్ సందర్శనలో భాగంగా తొడితల గూడెం ప్రాథమికోన్నత పాఠశాల , ప్రాథమిక పాఠశాల పంతులు నాయక తండా లో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి ఆఖస్మికంగా సందర్శించారు.
పాఠశాలలో జరుగుతున్న పౌండేషనల్ లిటరసీ , న్యూమరసి , బోధన అభ్యసన ప్రక్రియలను ముందుగా పరిశీలించిన తర్వాత విద్యార్థులతో ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అయ్యారు.
ప్రాథమిక పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా అమలు పరచబడుతున్న " ఎవ్రీ చైల్డ్ రీడ్స్ " అనే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మానిటరింగ్ అధికారి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో " ఫైవ్ ప్లస్ వన్ సిస్టం " అమలులో ఉందని , తరగతి బోధన అభ్యసన ప్రక్రియలో పాఠ్యపుస్తకాలను , వర్కు బుక్కులను కోఆర్డినేట్ చేసుకుంటూ తమ తమబోధన అభ్యసన ప్రక్రియలను నిర్వహించాలని తద్వారా మాత్రమే పిల్లలకు అభ్యాసం పెరుగుతుందని ఉపాధ్యాయులకు వివరించినారు. అదేవిధంగా తరగతి గదులలో జరిగే నాణ్యమైన బోధన ద్వారా మాత్రమే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మరింతగా ఆకర్షితమవుతారని తద్వారా బడులలో నమోదు పెరుగుతుందని ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ పర్యటనలో మానిటరింగ్ అధికారి వెంట ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు , సిఆర్పి కిషోర్ బాబు పాల్గొన్నారు.
