నర్మేట పల్లె ప్రకృతి వనం నర్సరీని పరిశీలించిన కలెక్టర్.

99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం నంగునూరు

నర్మేట పల్లె ప్రకృతి వనం నర్సరీని పరిశీలించిన కలెక్టర్.

సిద్ధిపేట జిల్లా ప్రతినిధి మార్చి14:(లోకల్ గైడ్ తెలంగాణ) 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం నంగునూరు మండలంలోని నర్మేట గ్రామంలో గల పల్లె ప్రకృతి వనం నర్సరీలో మొక్కల పెంపకం ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నర్సరీ నిర్వహణ పనులు, గ్రామంలో ఉన్న వీధి కుక్కల సర్వే మరియు వాక్సినేషన్ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.నర్సరీలో పెంచుతున్న మునగ, గులాబీ, గన్నేరు, కానుగ, అడవి తంగేడు మొక్కలను పరిశీలించారు. మొక్కల పెంపకంలో సహజ సిద్ధంగా లభించే ఎరువులను మాత్రమే వినియోగించాలని సూచించారు. మునగ మొక్కలను హాస్టళ్లు మరియు పాఠశాలలకు సరఫరా చేయాలని తెలిపారు. అలాగే కానుగ మొక్కల పెంపకాన్ని పెంచాలని, ఇవి వేసవికాలంలో కూడా చల్లని వాతావరణాన్ని కల్పించడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.వేసవి కాలం కావున మొక్కలకు సకాలంలో నీరు అందించాలని, నర్సరీలను ఎల్లప్పుడూ శుభ్రంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే సీజన్‌కు అవసరమైనంత మొక్కలు పెంచేందుకు అవసరమైన మెటీరియల్‌ను ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. గ్రామంలో నాటిన ప్రతి మొక్క జీవించేలాగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Tags:

About The Author

Latest News