శాఖాహారం అమృతహారం.
ద్వితీయ వార్షికోత్సవం బోయవాడ ధ్యాన కేంద్రం భారీగా ర్యాలీ తీశారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బ్రహ్మర్షి పితామహా ప్రతిజీ వారి సహకారంతో ఆదివారం నల్గొండ శ్రీ సద్గురు సదానంద పిరమిడ్, శ్రీ గణేష్ పిరమిడ్ ద్వితీయ వార్షికోత్సవం బోయవాడ ధ్యాన కేంద్రం భారీగా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా దామోదర్ మహాస్వామి, కడ్తాల్ పిరమిడ్ ట్రస్ట్, భూపతి రాజు ధ్యాన గద్దర్, భూసాని జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. హింస చోడో హంస పకడో, జీవించు జీవించు నీవు, పక్షులను చంపి వండుకు తినేవాడు వసుధ చండాలుడు, జీవులను చంపి జీవులకు పెడితే పాపంలో చిక్కుకుంటారు, ఈ సృష్టిలో ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు, అహింస ద్వారానే ధర్మం ధర్మం ద్వారానే ఆరోగ్యం ఆనందం ధ్యానంతో శాంతి ధ్యాన కుటుంబంతో ప్రశాంతి ధ్యాన కేంద్రాలతో విశ్వశాంతి అని తెలిపారు. ధ్యానంతో లాభాలు సందర్భంగా గుర్తు చేశారు ధ్యాన సాధన ద్వారా శారీరక మానసిక అనారోగ్యాలైన బీపీ షుగర్ చర్మవ్యాధులు డిప్రెషన్ వెన్నునొప్పి క్యాన్సర్ గుండె నొప్పి వంటి సంస్థ వ్యాధులు తగ్గుతాయని జ్ఞాపకశక్తి ఏకాగ్రత బుద్ధి కుశలత మానసిక ప్రశాంత మొదలైన పెరగడంతో పాటు దుర్గుణాలు, దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చని గుర్తు చేశారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసని తెలిపారు. ప్రతి ఒక్కరు శాఖాహారిగా ఉండి ఒక జీవిని మరొక జీవిని చంపకూడదని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాగర్ సతీష్ బాబు శివకుమార్, పి ఎం సి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
