మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద...
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
రాష్ట్రంలో మహిళా సంక్షేమం,అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.జైపూర్ మండలం ఇందారం గ్రామంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,మండల తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,డిసిసి ప్రతినిధి రఘునాథ్ రెడ్డి లతో కలిసి గ్రామైఖ్య సంఘాల భవనాలకు బుధవారం భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతు ప్రభుత్వం మహిళల సంక్షేమం,అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.ఈ క్రమంలో 30లక్షల రూపాయల వ్యయంతో 3గ్రామైఖ్య సంఘాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు.చెన్నూరు నియోజకవర్గంలో 3కోట్ల 50లక్షల రూపాయలతో 35భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్,పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు ఇందిరా శక్తి క్యాంటీన్లు,పెరటి కోళ్ల పెంపకం,ఇతర అనేక వ్యాపారాలలో ప్రోత్సహిస్తు మహిళలను ముందంజలో ఉంచే విధంగా కృషి చేస్తుందని తెలిపారు.మహిళలకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించి,బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించనున్నట్లు తెలిపారు.రుణం పొందిన స్వయం సహాయక సంఘాలు సకాలంలో చెల్లించి తిరిగి రుణం పొంది తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.మహిళలు తాము చేపట్టిన వ్యాపారాలను క్రమపద్ధతిలో నిర్వహిస్తు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రాయితీ గ్యాస్ సిలిండర్,గృహజ్యోతి పథకం ద్వారా 200యూనిట్ల ఉచిత విద్యుత్,ఇందిరమ్మ ఇండ్లు లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.జైపూర్ మండలానికి 753ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 200ఇండ్లు స్లాబ్ స్థాయిలో ఉన్నాయని,ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని అర్హులైన లబ్ధిదారులకు వచ్చే విడతలో అందజేస్తామని తెలిపారు.15సంవత్సరాల వయసు కలిగిన బాలికలకు ప్రభుత్వం హెచ్ పి వి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుందని,భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.జైపూర్ మండలంలో చేపట్టిన1వెయ్యి 250మెగావాట్ల పవర్ ప్లాంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ప్లాంట్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన పట్టాదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌకధరల దుకాణాల ద్వారా దాదాపు13వేల కోట్ల రూపాయలతో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ప్రజలతో చెన్నూరు నుండి హైదరాబాద్ వరకు బస్సు సర్వీసులను నిర్వహిస్తున్నామని,అదనంగా మరో బస్సు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని,ప్రజా సంక్షేమంలో భాగంగా గ్యారంటీ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రజా ప్రతినిధులు,అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పారిశుధ్యం,ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్,ఆరోగ్యం,అరైవ్ అలైవ్,సంక్షేమం,పిల్లల భద్రత,వ్యవసాయం,విద్య,యువత,మహిళలు,పర్యావరణం తదితర అంశాలపై ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.ప్రతి జిల్లాలోని గ్రామపంచాయతీల సర్పంచ్ లు,మున్సిపల్ కార్పొరేషన్,మున్సిపల్ కార్పొరేటర్లు,కౌన్సిలర్లకు జిల్లా కేంద్రాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.అనంతరం మండలంలోని 39మంది కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.నిరుపేద ఆడపడుచులకు వివాహానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని,మండలంలో ఇప్పటివరకు 375మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.అదేవిధంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వ్యాపార రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తు మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించనున్నట్లు తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళలు ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా అదనపు ఆదాయం పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.గ్రామపంచాయతీలలో కార్యాలయ భవనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని,ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మహిళ సమాఖ్య భవనాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ప్రభుత్వం విద్య,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తు చర్యలు చేపడుతుంని,అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యులను చేసామని,తద్వారా ప్రభుత్వ పాఠశాలలను 3శాతం విద్యార్థుల సంఖ్య పెంపొందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామైఖ్య సంఘాల మహిళలు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
