మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు _కలెక్టర్ పట్నాయక్
నారాయణపేట జనవరి 22:
జిల్లాలోని నారాయణ పేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీ లలో
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మున్సిపల్ ఎన్ని కలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానున్న నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగరక ర్నూలు, నారాయణ పేట జిల్లాల కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ సిక్తా పట్నా యక్ మాట్లాడుతూ
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు తెలిపారు. వీటి వివరాలను ఇప్పటికే టీ.పోల్ లో నమోదు చేయడం జరిగిందన్నారు. ఆర్.ఓ ఏ.ఆర్.ఓ ల ను గుర్తిం చడం జరిగిందని తెలిపా రు.పోలింగ్ నిర్వహణకు సరిపడా సిబ్బంది అందు బాటులో ఉన్నారని తెలిపా రు. మొత్తం 4 మున్సిపాలి టీలకు గాను 149 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరి గిందని, అవసరమైన బ్యాలె ట్ బాక్స్ లు సిద్ధంగా ఉన్న ట్లు,పోలింగ్ కేంద్రాల్లో
వెబ్ క్యాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు.కౌంటింగ్ నిర్వహణ కు ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు. జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్,ఎస్.ఎస్.టి బృందాల కు మెజిస్టీ రీయల్ అధికారాలు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.కాగా, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలను సాఫీగా నిర్వ హించేలా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ఎన్నికల కమి షనర్ రాణీ కుముదిని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక జిల్లా అదనపు రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, నోడల్ అధి కారులు,మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:5.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్
