సాంఘిక పౌరాణిక నాటక ప్రదర్శనకు ప్రాముఖ్యత కల్పించాలి.

శ్రీకృష్ణ రాయబారము పద్య నాటక శిక్షణ కార్యక్రమానికి ప్రారంభోత్సవo .

సాంఘిక పౌరాణిక నాటక ప్రదర్శనకు ప్రాముఖ్యత కల్పించాలి.

జూలూరుపాడు :లోకల్ గైడ్: జనవరి 21

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో మే నెల 11 ,12 తేదీల్లో పంచముఖ ఆంజనేయ స్వామి వార్షికోత్సవ సందర్భంగా జరుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీకృష్ణరాయబారం పౌరాణిక పద్య నాటకము ప్రదర్శించుటకు శిక్షణ నిమిత్తం స్థానిక కళాకారుల ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర నాటక సమాజల సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పాకాలపాటి రోశయ్య చౌదరి హాజరై, స్థానిక శివాలయంలో మరియు కోట మైసమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని విష సంస్కృతిని ఒక వెల్లువ లా విస్తరింప చేస్తున్న సినీ టీవీ సోషల్ మీడియా రంగాల నుండి మనలను, మన సమాజాన్ని రక్షించుకోవడానికి మన సాంప్రదాయ ప్రాచీన కళలు, నాటకాలు, పల్లెలలో పట్టణాలలో విరివిగా ప్రదర్శింపజేయాలని ఆయన ప్రసంగములో ఉద్ఘాటించారు. ఈ పూజా కార్యక్రమంలో పాపకొల్లు సర్పంచ్ బాదావత్ రాంబాబు, ఉప సర్పంచ్ తోట రామారావు, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి నాట్య కళామండలి సభ్యులు, నిర్వాహకులు, గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు