బహుళ ప్రమాదాల విపత్తులపై మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహణకు పక్కడ్బంది ఏర్పాట్లు ఎంతో అవసరం -ఎన్.డి.ఏం.ఏ అధికారులు సూచించారు. 

సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

బహుళ ప్రమాదాల విపత్తులపై మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహణకు పక్కడ్బంది ఏర్పాట్లు ఎంతో అవసరం -ఎన్.డి.ఏం.ఏ అధికారులు సూచించారు. 

IMG-20260120-WA0093రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ( లోకల్ గైడ్ ):                బహుళ ప్రమాదాల విపత్తు నిర్వహణకు మాక్ డ్రిల్ ఈనెల 21న జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న మాక్ ఎక్సర్ సైజ్ కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.  బహుళ విపత్తుల దృశ్యం ఆధారంగా మాక్ డ్రిల్ సంభవించిన వెంటనే చేపట్టాల్సిన తక్షణ చర్యలు, సమన్వయం, సమాచార వ్యవస్థ, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మాక్ డ్రిల్ నిర్వహణకు నిర్ణీత ప్రణాళిక, ఆయా శాఖల బాధ్యతలు, విమానయానేతర రంగంలో విపత్తు నిర్వహణకు సంబంధించిన మాక్ డ్రిల్ ఈ నెల 21 బుధవారం నాడు శంషాబాద్ లోని ఎయిర్ పోర్టు  ఆవరణలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 
             బహుళ ప్రమాదాల విపత్తులు, వరదలు, ఊహించని రీతిలో ప్రమాదాలు జరిగిన సమయంలో ఎలా స్పందించాలి, ఆస్తి, ప్రాణనష్టం నివారించేందుకు ఏవిధమైన చర్యలు తీసుకోవాలి, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగాహన కలుగుతుందని, విపత్తులను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధత ఏ మేరకు కలిగి ఉన్నామనేది అవగతం అవుతుందని అన్నారు.  మాక్ ఎక్సర్ సైజ్ ను పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని ఎన్.డి.ఏం.ఏ అధికారులు సూచించారు. 
             ఇది కేవలం మాక్స్ ఎక్సైజ్ మాత్రమే అని, దీని ద్వారా ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు భయపడకుండా, ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ మాక్ ఎక్సైజ్ ను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి వదంతలను ప్రచారం చేయొద్దని కోరారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు