నూతన జిజిహెచ్ నిర్మాణం స్పోర్ట్స్ వసతుల అభివృద్ధిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
By Ram Reddy
On
లోకల్ గైడ్ /సంగారెడ్డి:
సంగారెడ్డి, జిల్లాలో ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచే లక్ష్యంతో నిర్మించబడుతున్న 273 కోట్ల విలువైన నూతన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గురువారం ఆకస్మికంగా పరిశీలించారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ ఆసుపత్రి నిర్మాణ పనులు , మెడికల్ కళాశాల లో స్పోర్ట్స్ పనులను సమీక్షిస్తూ అధికారులను పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు . పాత భవనం లోఉన్న వంద పడకలను , టీ–హబ్బు ను రిలొకేట్ చేసి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు . అనంతరం మెడికల్ కళాశాలలో జరుగుతున్న క్రీడా అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. సిఎస్ఆర్ నిధులతో నిర్మాణం జరుగుతున్న ఈ స్పోర్ట్స్ సదుపాయాలను మూడు నెలల్లోపు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల శారీరకాభివృద్ధికి, ఆరోగ్య పరిరక్షణకు, క్రీడా ప్రతిభ పెంపొందించడానికి ఈ సదుపాయాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. జి జి హెచ్ లోని యూడీఐడి వార్డు ను కేన్సర్ డే కేర్ సెంటర్‌ను కూడా కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యాధికారులకు ఆదేశించారు . జిల్లాలో వైద్య సేవల స్థాయిని మరింత ఉన్నతంగా తీసుకెళ్లేందుకు విభాగాలు సమన్వయంతో విధులు నిర్వహించాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ, నిర్ణీత కాలానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
05 Mar 2026 20:11:34
ఖమ్మం: లోకల్ గైడ్)ఆసుపత్రిలో అర్థరాత్రి వెళ్ళినా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పించాలి
వైద్య సిబ్బంది మెరుగైన పని తీరుతో మార్పు సాధ్యం
పాలేరు నియోజకవర్గంలో రెండు...
