మోటార్ స్టార్టర్ వద్ద కరెంట్ షాక్‌తో యువకుడు మృతి.

బంట్వారం ఎస్సై విమల.

మోటార్ స్టార్టర్ వద్ద కరెంట్ షాక్‌తో యువకుడు మృతి.

లోకల్ గైడ్/బంట్వారం:

నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన నక్క శ్రీకాంత్ (21) కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన విషాద ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం… కోటకొండ గ్రామానికి చెందిన నక్క కిష్టప్ప (50) ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆయన కుమారుడు శ్రీకాంత్ వృత్తిరీత్యా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 17, 2026 రాత్రి వికారాబాద్ జిల్లా,బంట్వారం మండలం,బంట్వరం గ్రామానికి చెందిన దొడ్లగడ్డ రాములు (తండ్రి హనుమయ్య) పొలంలో గొర్రెల మందలను ఆపారు.అదే రోజు రాత్రి తాగునీరు కోసం వెళ్లిన శ్రీకాంత్, పొలంలో ఉన్న మోటార్ స్టార్టర్ సమీపంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు గమనించకుండా వాటిపై అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. విద్యుత్ తీగలు రెండు కాళ్లకు తగలడంతో అతడు తీవ్ర కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.సమాచారం అందుకున్న బంట్వారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ ఘటనతో కోటకొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై విమల,తెలిపారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం