త్రివేణి లో ఘనంగా వీడ్కోలు వేడుకలు
ఖమ్మం లోకల్ గైడ్ 
ఖమ్మం పట్టణంలోని స్థానిక త్రివేణి పాఠశాల యాజమాన్యం వారు పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు స్థానిక హరిత గార్డెన్స్ నందు వీడ్కోలు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా న్యూరో సైకియాట్రిస్ట్ శ్రీ దివ్య రెడ్డి పాల్గొని పిల్లలకు పరీక్షలకు సంబంధించి పలు సూచనలు తెలియజేశారు. పరీక్షలలో భయం లేకుండా ధైర్యంగా రాయడం కోసం పలు సూచనలు చేశారు.సోషల్ మీడియా కి దూరంగా ఉండాలని, గమ్యం చేరుకోవడం కోసం గట్టిగా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు... త్రివేణి డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తన సందేశం లో గత 22 సంవత్సరాలుగా త్రివేణి ఖమ్మం పదవ తరగతిలో అనేక రాష్ట్రస్థాయి ర్యాంకులను అందించిందని ఇది అంతా కూడా మా త్రివేణి కరికులం మూలాన మాత్రమే సాధ్యపడిందని తెలియజేశారు. ఈ ర్యాంకుల సాధనలో నిష్ణాతులైన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల సహకారం, మా ప్రణాళిక కలిసి అద్భుతమైన విజయాలను అందుకున్నాము. భవిష్యత్తులో కూడా అంతకుమించి మంచి ర్యాంకులు తేవాలని పిల్లలకు సందేశం పంపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ త్రివేణి విద్యార్థులు అంటేనే ర్యాంకర్లనీ,సుగుణాల బ్యాంకర్లని,10వ తరగతి ఫలితాలలో మాకు మేమే పోటీ అని తెలియజేశారు.
పదవ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ వారి యొక్క అనుభూతులని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ముస్తఫా, స్వప్న ,నయీమ్, పదవ తరగతి ఇంచార్జ్ శ్రీధర్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
