పంటల సాగుపై రైతులతో అధికారుల చర్చ గోష్టి. 

పంటల సాగుపై రైతులతో అధికారుల చర్చ గోష్టి. 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

ఎటిఎంఎ ఆధ్వర్యంలో రైతులకు,వ్యవసాయ శాస్త్రవేత్తలకు గురువారం చర్చాగోష్టి నిర్వహించారు.బెల్లంపల్లి నియోజకవర్గంలోని సుమారు 40మంది రైతులకు కన్నాల రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించారు.రైతులు ప్రస్తుతం వ్యవసాయంలో గమనిస్తున్న చీడ పీడలు తెలపగా వాటి నివారణ చర్యల గురించి చర్చించుకున్నారు.రైతులు మామిడిలో ప్రస్తుతం ప్రధాన చీడపీడల సమస్యలు సభ దృష్టికి తీసుకు రాగ కెవికె శాస్త్రవేత  శ్రవంతి యాజమాన్యం పద్ధతులు వివరించారు.అదేవిధంగా కాసిపేట ఎఓ ప్రభాకర్ మాట్లాడుతు వివిధ పంటలలో ప్రస్తుతం వచ్చే తెగులు సమస్యలు వాటి నివారణ చర్యలు తెలిపారు.కన్నెపల్లి మండలం ఎఓ ప్రశాంత్ గ్లైసీల్ పత్తి వలన కలిగే దుష్ప్రభావాలు తెలియజేసారు.అంతేకాకుండా వేమనపల్లి ఎఓ వీరన్న సహజ వ్యవసాయం గురించి తెలుపగా,భీమిని ఎఓ యమున ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ వినియోగించుకొనుటకు,ఫర్టిలైజర్ బుకింగ్ గురించి వివరించగా,నెన్నెల ఎఓ సృజన ఫార్మర్ రిజిస్ట్రీ గురించి,తాండూరు ఎఓ సుష్మ పిఎం కిసాన్ పథకం,విత్తన శుద్ధి గురించి వివరించారు.బెల్లంపల్లి ఎఓ సుద్దాల ప్రేం కుమార్ సమీకృత వ్యవసాయ విదానాలు వివరించారు.బెల్లంపల్లి ఎడిఎ రాజా నరేందర్ నేల పోషణ,సేంద్రియ కర్భన వృద్ధి,మట్టి పరీక్షల ప్రాముఖ్యత తెలియజేశారు.అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ మాట్లాడుతు రైతులందరు వ్యవసాయ,ఉద్యానశాఖలోని వివిధ పధకాలు,సాగులో మెలుకువలకు కెవికె శాస్త్ర వేత్తలు వ్యవసాయం అధికారులను సంప్రదిస్తు నాణ్యమైన వ్యవసాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి తిరుపతి,బిటిఎం సంధ్య,విశ్వమిత్ర,భీమిని బెల్లంపల్లి డివిజన్ ల రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి.... ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి....
ఖమ్మం: లోకల్ గైడ్)ఆసుపత్రిలో అర్థరాత్రి వెళ్ళినా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పించాలి వైద్య సిబ్బంది మెరుగైన పని తీరుతో మార్పు సాధ్యం పాలేరు నియోజకవర్గంలో రెండు...
త్రివేణి లో ఘనంగా వీడ్కోలు వేడుకలు
పంటల సాగుపై రైతులతో అధికారుల చర్చ గోష్టి. 
ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం 
శ్రీశ్రీశ్రీ లింగమంతుల స్వామి మాణిక్యాల దేవి కళ్యాణ మహోత్సవం.
నూతన జిజిహెచ్ నిర్మాణం  స్పోర్ట్స్ వసతుల అభివృద్ధిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్యాడ్ల బహుకరణ