కొత్త కావడిగుండ్లలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జనరల్ బాడీ సమావేశం

భేటీకి పార్టీ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు ముఖ్య నేతృత్వం వహించారు.​

కొత్త కావడిగుండ్లలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జనరల్ బాడీ సమావేశం

 

​అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
మండలంలోని కొత్త కావడిగుండ్ల గ్రామంలో ఆదివారం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. గ్రామ కమిటీ కార్యదర్శి కంగాల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు ముఖ్య నేతృత్వం వహించారు.​ సమావేశంలో పాల్గొన్న జిల్లా నాయకులు కంగాల కల్లయ్య, వాసం బుచ్చిరాజులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో సామాన్యులకు, రైతులకు ఒరిగింది ఏమీ లేదని వారు విమర్శించారు. ముఖ్యంగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని, పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త కావడిగుండ్ల గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తత, తాగునీటి ఎద్దడి వంటి మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. మార్చి 23న విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించాలని, ఆ రోజు సాయంత్రం అశ్వారావుపేట లో నిర్వహించే కాకడాల ప్రదర్శనను భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాడిశ లక్ష్మణ్ రావు, వార్డు మెంబర్ వాసం పోతురాజు, ప్రగతిశీల మహిళా సంఘం మండల కార్యదర్శి కంగాల భూలక్ష్మి, ప్రగతిశీల యువజన సంఘం మండల నాయకులు కొమరం లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. వారితో పాటు పార్టీ గ్రామ కమిటీ సభ్యులు కణితి గోపాలరావు, కొమరం లక్ష్మి, సోడెం పౌల్ రాజు, కంగాల చిన్న వంగరావు, కణితి పెద్ద జోగారావు, జెడ్డి బుచ్చయ్య, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం. నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.
*       ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్    వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
సకల మానవాళికి ప్రమాదం యుద్ధం
జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు.....
ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఘనంగా వివాహ వేడుక
46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజల మధ్యే సంక్షేమం…  నేరుగా లబ్ధిదారుల చేతికి కోట్ల చెక్కులు..
కార్మిక లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా