హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం.
_హుజురాబాద్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుని, చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్న అధికార ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం
_నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్
హైదరాబాద్ ఫిబ్రవరి 16( లోకల్ గైడ్ ప్రతినిధి)
హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా భారీ కాన్వయ్‌తో మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని, నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వొడిదల ప్రణవ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.నూతన పాలకవర్గ సభ్యులు ఎన్నికల ఇన్‌చార్జ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ కి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వొడిదల ప్రవీణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతుందని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్ దే అన్నారు.సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజాపాలన ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేస్తూ, నిత్యం వారి పట్ల బాధ్యతతో వ్యవహరించాలని నూతన పాలకవర్గ సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
