అండగా ఉంటా అభివృద్ధి చేస్తా. ..జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి
19వ వార్డులో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం.
By Ram Reddy
On
పాల్గొన్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు.
అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
ప్రచారంలో భాగంగా సత్యనారాయణ చౌదరి గతంలో వార్డులో చేపట్టిన రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం మరియు వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న ఆయన, పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహనతో, ప్రజలతో మమేకమవుతూ సాగిన ఈ ప్రచారానికి వార్డు వాసుల నుంచి మంచి స్పందన లభించింది. తమ సమస్యలను విన్నవించుకోవడమే కాకుండా, అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కనిపించింది. తనకు అవకాశం కల్పిస్తే వార్డును అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బండారు మహేష్, సీనియర్ నాయకులు షేక్ ముబారక్, జల్లిపల్లి దేవరాజు, బాలయ్య మరియు ఇతర కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
15 Feb 2026 21:44:23
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
