సీ ఆర్ పీ ఎఫ్ 81 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం కార్యక్రమం

మహిళలకు కుట్టు మిషన్ల ఉచిత శిక్షణ - పంపిణీ 

సీ ఆర్ పీ ఎఫ్ 81 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం కార్యక్రమం

IMG-20260216-WA0236చర్ల, ఫిబ్రవరి 16 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధి అటవీ ప్రాంత పూసుగుప్ప గ్రామంలో సీ ఆర్ పీ ఎఫ్ 81 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్పిఎఫ్  81 బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెడ్ హిమానుష్ ప్రసాద్, పూసుకుప్ప సర్పంచ్ సావిత్రి పాల్గొన్నారు. సెకండ్ హ్యాండ్ కమాండర్ హిమాన్సు ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూసుగుప్ప గ్రామంలోని నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ల పై  ఉచిత శిక్షణ, పంపిణీ  కార్యక్రమాన్ని నిర్వహించామని, సిఆర్పిఎఫ్ ఎఫ్ / 81 బెటాలియన్ సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, నిరు పేద ప్రజలకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్కీంలో భాగంగా కేంద్రహోమ్ శాఖ  ఆదేశాల ప్రకారం సిఆర్పిఎఫ్ 81ఎఫ్ బెటాలియన్ సివిక్ యాక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, దానిలో భాగంగా గతవారం భీమారం గ్రామంలో నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని,  నిరుపేద మహిళలు 34 మందిని గుర్తించి, వారికి కుట్టు మిషన్ పై  శిక్షణ  కల్పించి, వారి జీవనోపాధికి ఆసరాగా, వారు అభివృద్ధి చెందేందుకు కుట్టుమిషన్లు పంపిణీ  చేస్తున్నామని తెలిపారు. ఈ విధంగా ఆదివాసి ప్రాంతాల్లోని పేద ప్రజలకు సిఆర్పిఎఫ్ ఎఫ్ 81  బెటాలియన్ సివిక్ యాక్షన్ ప్రోగ్రాములు నిర్వహిస్తూ వారి అభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉండేందుకు దోహదపడతాయని తెలిపారు.

Tags:

About The Author

Latest News