ప్రజాసేవే పరమావధిగా పదవీ ప్రమాణం

అశ్వారావుపేట రాజకీయాల్లో మిండా హరి నవశకం!

ప్రజాసేవే పరమావధిగా పదవీ ప్రమాణం

​అశ్వారావుపేట, లోకల్ గైడ్ :

పదవులు శాశ్వతం కాదు ప్రజలకు చేసే సేవ మాత్రమే చరిత్రలో నిలిచిపోతుందని నమ్మే నాయకుడు, ప్రజా క్షేత్రంలో అజేయుడు మిండా హరి అశ్వారావుపేట మున్సిపాలిటీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఏఎస్ఆర్ నగర్ 10వ వార్డు కౌన్సిలర్‌గా ఆయన చేసిన పదవీ ప్రమాణం కేవలం ఒక పదవిని స్వీకరించడం కాదు, ఆ ప్రాంత అభివృద్ధికి అంకితమవ్వడమేనని నిరూపించారు. ​మిండా హరి అంటే అశ్వారావుపేట రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అనుభవం. గతంలో రెండుసార్లు ఎంపీటీసీగా పనిచేసి, తనదైన ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు నూతన మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుడి వెన్నంటే ఉంటూ, నిబద్ధత గల అనుచరుడిగా పేరు తెచ్చుకున్న హరి, క్షేత్రస్థాయిలో ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా ఈ విజయాన్ని అందుకున్నారు.​పదవీ ప్రమాణం అనంతరం మిండా హరి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ సారథ్యంలో అశ్వారావుపేట పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ, వార్డు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. నాపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ఏఎస్ఆర్ నగర్ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు దక్కిన ఈ బాధ్యతను ప్రజల సమస్యల పరిష్కారానికే అంకితం చేస్తాను. పట్టణ అభివృద్ధిలో భాగస్వామినై, ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలను అందిస్తానని మిండా హరి స్పష్టం చేశారు. ​మిండా హరి ప్రమాణ స్వీకారంతో ఏఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. సామాన్య కార్యకర్త నుంచి కౌన్సిలర్ స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని స్థానికులు కొనియాడుతున్నారు. హరి నాయకత్వంలో తమ వార్డు రూపురేఖలు మారుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News