ఒక్క ఓటు విజయం నాలో బాధ్యతను మరింత పెంచింది..!

53వ డివిజన్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ రమేష్ కుమార్ 

ఒక్క ఓటు విజయం నాలో బాధ్యతను మరింత పెంచింది..!

మహబూబ్ నగర్ ఫిబ్రవరి 16 (లోకల్ గైడ్ జీవి గౌడ్)

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్లో ఒక్క ఓటుతో తాను గెలుపొందడం నాలో మరింత బాధ్యతను పెంచిందని డివిజన్ కార్పొరేటర్ రమేష్ కుమార్ అన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున తాను కార్పొరేటర్ గా నిలబడినందుకు తాను గర్విస్తున్నారని వెల్లడించారు. తనకు ఓటు వేసిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసినట్టు వెల్లడించారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడుచుకుంటానని వెల్లడించారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తానని వెల్లడించారు. పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ సహకారంతో ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకువచ్చి డివిజన్ ను అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.

Tags:

About The Author

Latest News