శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
కొండాపూర్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లాఉద్దీన్ పటేల్ ఆధ్వర్యంలో దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ నాయకులతో కలిసి పాల్గొని ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందును పంచుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..రంజాన్ మాసం శాంతి, సహనం, దాతృత్వం వంటి విలువలను సమాజానికి అందించే పవిత్ర కాలమని పేర్కొన్నారు. ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్ విందును కలిసి పంచుకోవడం ద్వారా పరస్పర ప్రేమాభిమానాలు మరింత బలపడతాయని తెలిపారు. అల్లాహ్ దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పఠాన్ చేరు బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాధవరం రంగారావు, చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, ఎర్రబెల్లి సతీష్ రావు, మల్లారెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, వల్ల హరీశ్ రావు, సంగారెడ్డి, శివరాజ్ ముదిరాజ్, విజయ్ రెడ్డి, మల్లేష్ ముదిరాజ్, గంగాధర్ గౌడ్, మున్నా, సంతోష్, నరేందర్, మజీత్, సంతోష్ నాయుడు, ముజీబ్ తదితర బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ మాసం శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.