ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా పదవ తరగతి పరీక్షలు సవ్యంగా నిర్వహించాలి.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మార్చి 14. (లోకల్ గైడ్)
ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా పదవతరగతి పరీక్షలు సవ్యంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు .శనివారం పదవతరగతి పరీక్షలు ప్రారంభం కాగా, నల్గొండ జిల్లా కేంద్రం లోని సైంట్ ఆల్ఫాన్స్,నల్గొండ మండలం దోమలపల్లి జెడ్ పి హెచ్ ఎస్,మునుగోడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అన్ని కేంద్రాలలో విద్యార్థుల హాజరు,గైర్హాజరు వివరాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్లను అడిగి తెలుసుకున్నారు.అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తాగు నీరు ఏర్పాటు చేయాలని,వేసవి దృష్ట్యా కుండలలో చల్లటి నీరు ఉంచాలని,టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి పంపించాలని చెప్పారు.ప్రశ్నపత్రాలు,జవాబు పత్రాల డిపాజిట్ ను పోలీస్ భద్రతతో డిపాజిట్ చేయాలని ఆదేశించారు.పరీక్ష కేంద్రాలవద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని,పరీక్ష కేంద్రంలోకి ఇతరులేవరు వెళ్లకుండా చూడాలని అన్నారు.పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జీరాక్స్ కేంద్రాలు మూసివేసేలా నిర్ధారణ చేసుకోవాలని అన్నారు.జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగరాదని,పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు.
