మున్సిపాలిటీ కో-ఆప్షన్ రేసులో బండారు మహేష్?
పార్టీ విధేయతకు దక్కేనా గౌరవం?
అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కో-ఆప్షన్ సభ్యుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రేసులో ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన సీనియర్ నాయకులు, కాంగ్రెస్ సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షులు బండారు మహేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండానే ఊపిరిగా బతుకుతున్న మహేష్‌కు ఈసారి సముచిత స్థానం దక్కుతుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బండారు మహేష్ కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలుస్తోంది. గత 20 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మచ్చలేని నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, అప్పటి అధికార పార్టీ (బీఆర్ఎస్) పెట్టిన అనేక ఇబ్బందులను, ఒత్తిళ్లను తట్టుకొని కాంగ్రెస్ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన మహేష్‌కు కో-ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని క్షేత్రస్థాయి కార్యకర్తలు కోరుతున్నారు. బీసీ వర్గానికి చెందిన బలమైన నాయకుడు కావడం, నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది బండారు మహేష్. పదవుల కోసం పాకులాడకుండా, కేవలం సేవే లక్ష్యంగా పని చేసిన ఇటువంటి నాయకుడికి కో-ఆప్షన్ పదవి ఇస్తే అది కార్యకర్తలకు ఇచ్చే గౌరవమే అవుతుందని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిలోనూ, పార్టీ బలోపేతంలోనూ మహేష్ అనుభవం మున్సిపాలిటీకి ఎంతో ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి, ఇన్ని ఏళ్ల నిబద్ధతను గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం మరియు ఎమ్మెల్యే బండారు మహేష్‌కు ఆ అవకాశం కల్పిస్తారో లేదో వేచి చూడాలి.
