సీవోఈ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

మార్చి 12 నుంచి ఏప్రిల్ 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు

సీవోఈ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

 

 

భద్రాచలం : లోకల్ గైడ్ :
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సి.ఓ.ఈ) కళాశాలల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు భద్రాచలం గిరిజన గురుకుల సి.ఓ.ఈ (బాలికల) కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఏ. పద్మావతి తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాల కోసం రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో ఉన్న సి.ఓ.ఈ కాలేజీలకు ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 19న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థులు మార్చి 12 నుంచి ఏప్రిల్ 7 వరకు అధికారిక వెబ్‌సైట్ tgtwreis.telangana.gov.in లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
    వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన