నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత

నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత

 

కుత్బుల్లాపూర్ మార్చి 23 ( లోకల్ గైడ్ ప్రతినిధి)

జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మకమైన యోనెక్స్ సన్‌రైజ్ 48వ ఇండియన్ మాస్టర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026లో పురుషుల సింగిల్స్,  డబుల్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్ రౌండ్లను దాటి మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫికేషన్ ఫైనల్‌లో తమిళనాడుకు చెందిన శివశంకర్ తో తలపడిన వేణు ముప్పాల, 57 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించారు.  పురుషుల డబుల్స్ విభాగంలో వేణు ముప్పాల, తన భాగస్వామి జ్ఞాన ప్రసాద్ రెడ్డితో కలిసి అద్భుత విజయాన్ని నమోదు చేశారు. గత నాలుగేళ్లుగా నిరంతరం శ్రమిస్తున్న వేణు ముప్పాల
క్వాలిఫికేషన్ ఫైనల్‌లో మహారాష్ట్రకు చెందిన టాప్ సీడ్ జోడీ సచిన్ భారతి - కౌశిక్ వర్తక్ పైన సంచలన విజయం సాధించారు.  వేణు ముప్పాల ప్రస్తుతం జాతీయ స్థాయి క్రీడాకారుడిగానే కాకుండా, ఎందరో భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దుతున్న 'మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ' వ్యవస్థాపక చైర్మన్‌గా సేవలందిస్తున్నారు. ఒకే జాతీయ ఛాంపియన్‌షిప్‌లో  సింగిల్స్,  డబుల్స్ రెండింటిలోనూ మెయిన్ డ్రాకు అర్హత సాధించారు.

Tags:

About The Author

Latest News

నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత
    కుత్బుల్లాపూర్ మార్చి 23 ( లోకల్ గైడ్ ప్రతినిధి) జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మకమైన యోనెక్స్ సన్‌రైజ్
అభివృద్ధి నిరంతర ప్రక్రియ....
శాఖాహారం అమృతహారం.
దాతృత్వాన్ని చాటుకున్న సర్పంచ్ మత్రు నాయక్ 
ఏప్రిల్ 5 వ తేదీన జరిగే హిందూ సమ్మేళనంను జయప్రదం చేయండి. 
రైతు ఉత్సవాలకు అక్బర్‌పేట భూంపల్లి నుంచి తరలి వెళ్లిన
*ఎల్బీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం* *