వంద శాతం పిల్లల పఠనా సామర్థ్యం పెంచాలి... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ క్లాసులు నిర్వహించాలి.

వంద శాతం పిల్లల పఠనా సామర్థ్యం పెంచాలి... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం :లోకల్ గైడ్:

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు వంద శాతం ఇంగ్లీష్ పఠనా సామర్థ్యం ఉండాలనే ఉద్దేశ్యంతో రూపొందించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
 గురువారం స్థానిక శ్రీ భక్తరామదాసు కళాక్షేత్రం లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు లతో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.మండలాల్లో స్కూల్స్ వారిగా విద్యార్థుల పఠనా సామర్ధ్యం ఫలితాలపై సమీక్షిస్తూ, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యశాఖ అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని  ప్రతి రోజు గంట సమయం ప్రాథమిక పాఠశాలల్లోని  విద్యార్థుల రీడింగ్ స్కిల్స్ పెంచేందుకు ఉపాధ్యాయులు పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు గంట సేపు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి చదివే పిల్లలకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలు చేస్తూ, ప్రతి ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈసిఆర్ ప్రారంభించిన మొదటి వారం నుండి విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, ఇది పిల్లలకు జీవిత కాలం ఉపయోగపడే సామర్థ్యాన్ని మనం అందిస్తున్నామని తెలిపారు. రెండవ దశ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలులో పదాలు చదివే సామర్థ్యం ఉన్న పిల్లలు వ్యాఖ్యలు చదివేలా, అక్షరాలను చదివే పిల్లలు పదాలు చదివేలా సామర్ధ్య పెంపుకు కృషి చేస్తూ మంచి ఫలితాలను అందిస్తున్న ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. రాబోయే నెల రోజుల వ్యవధిలో 75 శాతం విద్యార్థులకు వ్యాఖ్యలు చదివే సామర్థ్యం రావాలని కలెక్టర్ అన్నారు. 
ఆంగ్ల భాష ఫోనెటిక్స్ బేసిక్ గా ప్రతి ఆంగ్ల అక్షరం ఎటువంటి సౌండ్ చేస్తుంది అనేది విద్యార్థులకు తెలిసేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని అన్నారు. ప్రతిరోజు టీచర్ ఆక్టివిటీ, స్టూడెంట్ ఆక్టివిటీ, ఒక స్టోరీ చెబుతూ పిల్లలను ఇంట్రాక్ట్ చేస్తూ మెటీరియల్ లో పిల్లలకు నేర్పే పదాలను ఉపయోగిస్తూ పదాలు నేర్పిన తర్వాత మెల్లగా పిల్లలతో ఆ స్టోరీలు చదివించాలని అన్నారు. పిల్లలకు పదాలు చదవడం నేర్పే సమయంలో ప్రతి అక్షరం ఏ సౌండ్ చేస్తుందో తెలియజేయాలని అన్నారు. విద్యార్థులకు రెగ్యులర్ గా నేర్చుకున్నది సాధన చేసే విధంగా 
పిల్లలకు ఫోనోటిక్ సౌండ్ తప్పనిసరిగా తెలిసేలా చదివించాలని అన్నారు. జిల్లాలో ఉత్తమ టీచర్స్ ఉన్నారని, కొంచెం దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలను సాధిస్తామన్నారు. విద్యార్థులకు ముందుగా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం అనే నైపుణ్యాలు రావడం చాలా కీలకమని అన్నారు.  ఒక విద్యార్థికి చదివే సామర్థ్యం అందిస్తే జీవితాంతం ఉపయోగపడుతుందని, కార్యక్రమ పర్యవేక్షణకు ఒక యాప్ లో యూ.డి.ఐ.ఎస్. తో అనుసంధానం చేయడం వల్ల  ప్రతి బుధవారం విద్యార్థి రీడింగ్ స్కిల్స్ అక్షరాలు, పదాలు, వ్యాఖ్యలు ఏ స్థాయిలో ఉన్నయో అప్ డేట్ చేయాలని అన్నారు.ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పాఠశాల హాజరు శాతం పెంచాలని,  పూర్తి హాజరు శాతంతో  విద్యార్ధుల విద్యా ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు.
ఉపాధ్యాయుల హాజరు అధికారులు పర్యవేక్షణ చేయాలని, అనుమతి లేని గైర్హాజరును ఉపేక్షించేది లేదని కలెక్టర్ అన్నారు. వంద శాతం పాఠశాలల అసెస్మెంట్ పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. ఫిబ్రవరి నెల చాలా కీలకమని కలెక్టర్ అన్నారు. లక్ష్య సాధనకు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు చొరవ చూపాలన్నారు.  వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎఫ్ఎల్ఎం అమలుపై దృష్టి పెట్టాలన్నారు.  ఎఫ్ఎల్ఎస్ సర్వే పూర్తి చేయాలన్నారు. 3వ తరగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మీరు చేసే కృషితో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారన్నారు. సమావేశ అనంతరం ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలు మంచి ప్రతిభ కనబరిచిన ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా అధికారులను కలెక్టర్ సన్మానించారు.ఈ సమావేశంలో* జడ్పీ సీఇవో దీక్షారైనా, జిల్లా విధ్యాధికారి చైతన్య జైనీ, విద్యా శాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సి.హెచ్. రామకృష్ణ, సిఎంఓ ప్రవీణ్, ఆర్ఎంఓ ప్రభాకర్ రెడ్డి, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు