రాజేంద్రనగర్ లో ప్రారంభమైన సమ్మక్క-సారక్క జాతర ఉత్సవాలు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
By Ram Reddy
On
రాజేంద్ర నగర్ జనవరి 28, (లోకల్ గైడ్ ):
ప్రతి ఒక్కరికి భక్తిచింతన ఎంతో అవసరమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం రాజేంద్రనగర్ పరిధిలో సమ్మక్క-సారక్క జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేలను సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...మేడారం జాతర తరహాలో రాజేంద్రనగర్ లో కూడా వనదేవతలను కొలుస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని ఇక్కడ స్థానిక గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజలు జరుగుతాయని అన్నారు.మేడారానికి వెళ్లలేని నగరవాసులు రాజేంద్రనగర్ ప్రాంతంలో జరిగే ఈ జాతరలో పాల్గొంటారని ఇలాంటి జాతర తన ప్రాంతాల్లో జరగడం సంతోషకర విషయమని పేర్కొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
