శేరిలింగంపల్లి అభివృద్ధికి పూర్తి సహకారం
సైబరాబాద్ తొలి మున్సిపల్ కమిషనర్ జి.సృజన హామీ
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ వెస్ట్ జోన్ స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ): శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు సైబరాబాద్ మున్సిపల్ తొలి కమిషనర్ జి.సృజన ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి, కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ అల్లావుద్దీన్ పటేల్, చారి, లక్ష్మీ, కమల, రాము, షబ్బీర్, ముఖిద్ కలిసి పాల్గొన్నారు. ఈ భేటీలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, రోడ్లు, కాల్వలు, వీధి దీపాలు, పార్కులు వంటి అంశాలపై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు మున్సిపల్ శాఖ చురుకైన చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ జి. సృజన శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పరిపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మిద్దెల మల్లారెడ్డి మాట్లాడుతూ..కమిషనర్ సానుకూల స్పందన ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ, పార్టీ ప్రతినిధుల సమన్వయంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి ప్రాంత అభివృద్ధికి దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత వేగం చేకూర్చనుందని పార్టీ నాయకులు తెలిపారు.
