వంగూరి వాచకం -నవరత్నాలు 

వంగూరి గంగిరెడ్డి 

వంగూరి వాచకం -నవరత్నాలు 

 

1. కత్తులు దూసేవాడికైనా 
విత్తులు వేసేవాడి మెతుకులే 
ఎత్తులు వేసేవాడికైనా 
పొత్తులు కలిపేసిన అతుకులే .

2.నీవు నవ్వినా ఏడ్చినా
వచ్చేది కంటనీరు 
నన్ను నాటినా పూడ్చినా
ఇచ్చేది పంట చేను .

3.ఎంతో సాధించానని
అంతగా ఎగిసిపడతావు ఎందుకు నింగికెగిసిన మేఘం 
వంగి నేలపై కొరియదా చివరకు.

4.కాకి రాకపోతే 
లోకుల కూతలు 
కాకి రాకతోనే 
నోళ్లకు మూతలు.

5.కుంగుబాటుతో లేనిదాన్ని
వల్లే వేస్తూ పడతావేల బెంగ అందుబాటులో ఉన్నదాన్ని అల్లుకుంటుంది చూడు బీరతీగ .

7.పని చేసేవాడు 
చేస్తాడు కొన్ని పొరపాట్లు 
పని చేయడు వాడు 
చూస్తాడు కదా పొరపాట్లు .

 8.పన్నులు కట్టేవారు 
అవుతున్నారు ఆపన్నులు 
పన్నులు ఎగ్గొట్టేవారు 
అవుతున్నారు సంపన్నులు .

9.అబద్ధాలు పచ్చిగా 
ఎందుకుంటాయో 
నిజాలు నిప్పులాగా
ఉన్నందుకేమో.

 వంగూరి గంగిరెడ్డి 
9652286270
షాద్ నగర్

Tags:

About The Author

Latest News

మహిళా సంఘాల ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి ,సామాజిక భాగస్వామి పెంపొందించటకు ఈ భవనాలు దోహదపడతాయి . మహిళా సంఘాల ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి ,సామాజిక భాగస్వామి పెంపొందించటకు ఈ భవనాలు దోహదపడతాయి .
    నల్లగొండ ఉమ్మడి .ఫిబ్రవరి 14.లోకల్ గైడ్ కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, బండపాలెం, కొండకిందిగూడెం గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘ భవనాల నిర్మాణ పనులకు
శంకరుడి "చేతి"లో త్రిశూలం.. కాంగ్రెస్ విష్ణు చక్రం..
వంగూరి వాచకం -నవరత్నాలు 
మున్సిపల్ చైర్మన్ గా బీసీ మహిళకు అవకాశం కల్పించాలి.
అందె మోహనుడికి  అన్నీ కలిసి వచ్చాయి..
బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
ఖమ్మం మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జోరు