పరిగి మున్సిపల్ 8,12 వ వార్డు బరిలో డాక్టర్ కావలి శివాని హనుమంతు ముదిరాజ్. 

8,12 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. 

పరిగి మున్సిపల్ 8,12 వ వార్డు బరిలో డాక్టర్ కావలి శివాని హనుమంతు ముదిరాజ్. 

8 ,12 వార్డులో గల ప్రజలు భారీ మెజార్టీతో ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థన.

లోకల్ గైడ్, పరిగి.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు నిర్వహిస్తుంది.దీంతో వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతుంది. పరిగి పరిధిలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర పోటీ నెలకొంది.అయితే ఈసారి మున్సిపల్ పరిధిలో 8, 12 వార్డులో శ్రీ డాక్టర్ కావలి శివాని హనుమంతు ముదిరాజ్ బరిలో నిలుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల రాజకీయాలలో డాక్టర్ శివాని హనుమంతు ముదిరాజ్ తనదైన శైలిలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు .ఈ సందర్భంగా రాజకీయాల్లో 8,12వార్డులోని ప్రజలు డాక్టర్ శివాని హనుమంతు ముదిరాజ్ పేరు అత్యంత ప్రాధాన్యత సంచరించుకుంది. వార్డు ప్రజల్లో డాక్టర్ శివాని హనుమంతు ముదిరాజ్ గతంలో పోటీలో లేకున్నా 8, 12 వార్డులలోని ప్రజలకు ఆమె సుపరిచితురాలు ఆమె పట్ల ప్రతి ఒక్కరికి మంచి సానుభూతి కలదు. అలాగే వార్డులోని సమస్యల పట్ల మంచి అవగాహన ఉందన్నారు.వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలకు తీవ్రవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్ శివాని హనుమంతు ముదిరాజ్ తండ్రి కావలి హనుమంతు ముదిరాజ్ అన్ని వర్గాల ప్రజల్లో తత్స సంబంధాలు కలిగి ఉన్నారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజల మద్దతు కల్పించాలని కోరుతున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రజల సహకారం పొందుటకు తగు విధమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వారి పయనం విజయవంతంలోకి రావాలని కౌన్సిలర్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .డాక్టర్ శివాని హనుమంతు ముదిరాజ్ కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని 8,12వ వార్డు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని అలాగే సమస్యలను ప్రభుత్వం దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని డాక్టర్ శివాని హనుమంతు ముదిరాజ్ తెలుపుతున్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 8,12 వార్డులలోని ప్రజలు బారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా శ్రీ డాక్టర్ కావలి శివాని హనుమంతు ముదిరాజ్ కోరారు.

Tags:

About The Author

Latest News