మిర్యాలగూడలో బీఆర్ఎస్ జోష్  మున్సిపల్  ఎన్నికల వేళ హీటెక్కిన రాజకీయం 

బీఆర్ఎస్ లో  ఊపందుకున్న చేరికలు  గులాబీ తీర్థం పుచ్చుకున్న 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 

మిర్యాలగూడలో బీఆర్ఎస్ జోష్   మున్సిపల్  ఎన్నికల వేళ హీటెక్కిన రాజకీయం 

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను బంపర్ మెజారిటీ తో గెలిపించుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే  శ్రీరామ రక్ష బడుగుల లింగయ్య యాదవ్, నల్లమోతు భాస్కర్ రావు 

IMG-20260128-WA0125 మిర్యాలగూడ జనవరి 28 
 (లోకల్ గైడ్ తెలంగాణ)
 

మిర్యాలగూడలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ జోష్ కొనసాగుతోందని మున్సిపోల్స్ మిర్యాలగూడ నియోజకవర్గ సమన్వయ కర్త,  మాజీ పార్లమెంటు సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. బుధవారం రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 18వ వార్డు - సుందర్ నగర్ నుంచి పెద్ది శ్రీనివాస్ గౌడ్, గుంజ కొండల్, మల్లేష్ ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ తీర్థం పుచ్చుకున్న  కార్యకర్తలను కండువాలు కప్పి బడుగుల లింగయ్య యాదవ్, నల్లమోతు భాస్కర్ రావు తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడారు. వచ్చేనెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడ పట్టణంలోని అనేక  వార్డుల నుంచి పోటీ చేసే అభ్యర్థులు దొరక్క కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో వరుస చేరికలు కొనసాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై నమ్మకంతో, గతంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు ఫలితంగా రాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీ వైపునకు ఆకర్షితులవుతున్నారని అన్నారు.  తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని అన్నారు.  బీఆర్ఎస్ తోనే మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు.  11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని  వారు సూచించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయిందన్నారు. మిర్యాలగూడ పురపీఠంపై గులాబీ జెండా ఎగురవేయలని ఆకాంక్షించారు. ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, అంకిత భావంతో పని చేయాలని, బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి పట్టణ ప్రజల్లో అవగాహన కల్పించాలని బడుగుల లింగయ్య యాదవ్, నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ, బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి వల్లంపట్ల వినోద్‌, గుంజ శ్రీనివాస్, చింతకుంట్ల చాంద్, గుడుగుంట్ల కిషోర్, పందిరి అరుణ్, కుర్ర రాజు, దండెం మధు, పెండ్ర నాని, మడప సాయిరాం, అనుముల సైదులు, పెండ్ర అశోక్, పెండ్ర మహేష్, పెండ్ర ఉపేందర్, మేలగర కృష్ణ కుమార్, మస్తాన్, నాగుల్ మీరా,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News