ఓటు వృథా చేయొద్దు – ఓటు మన హక్కు

షాద్‌నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లకు పిలుపు

ఓటు వృథా చేయొద్దు – ఓటు మన హక్కు

 లోకల్ గైడ్ / రంగారెడ్డి జిల్లా 

షాద్‌నగర్: షాద్‌నగర్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని లోకల్ గైడ్ తెలంగాణ మేనేజర్ పట్నం ప్రతాప్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, దాన్ని వృథా చేయకుండా బాధ్యతతో వినియోగించుకోవాలని సూచించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఒక్కటే సాధారణ పౌరుడికి ఉన్న శక్తివంతమైన ఆయుధమని ఆయన పేర్కొన్నారు. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేయడం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులు, యువత, మహిళలు సహా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతమైన ఓటింగ్ ద్వారానే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News