ఎలక్షన్ సరళి,  బందోబస్తు ను పరిశీలించిన

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ 

ఎలక్షన్ సరళి,  బందోబస్తు ను పరిశీలించిన

నారాయణపేట ఫిబ్రవరి 11:
నారాయణపేట జిల్లా పరిధి లో  జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు నారా యణపేట, మక్తల్, కోస్గి , మద్దూర్ నాల్గు మున్సిపాలి టీలలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నా యని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్  తెలిపారు. బుధవారం రోజు మక్తల్ లోని జడ్.పి.హె చ్.ఎస్ స్కూల్లో, గార్ల పల్లి లో నారాయణపేట జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,  గర్ల్స్ హై స్కూల్లో నీ పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్ని కల సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్త్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్  స్వయంగా పరిశీలించారు.ఎన్నికల ప్రక్రి యలో ఎలాంటి అంతరాయం లేకుండా శాంతియుత వాతా వరణం మున్సిపల్ ఎన్నికలు కొనసాగేలా చూడాలని అలా గే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీసూచించారు. 
మున్సిపల్ ఎన్నికలు సెన్సి టివ్, హైపర్ సెన్సిటివ్ పోలిం గ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టా లని సూచించారు.ఓటు వేయడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చూడాలని, క్యూ లైన్ లో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు.ఎన్నికలు పూర్త య్యే వరకు పోలీస్ విభాగం హై అలర్ట్‌లో కొనసాగాలని, శాంతి–భద్రతలను కాపా డడంలో ప్రతి పోలీసు సిబ్బం ది బాధ్యతగా ఉండాలని తెలి పారు  ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.ఎస్పీ తో పాటు డీఎస్పీ మహేష్, సీఐ లు శివశంకర్, రవి బాబు, రామ్ లాల్, ఎస్ఐ లు నరేష్, వెంకటేశ్వర్లు, భాగ్య లక్ష్మి రెడ్డి, బిజూ శ్రీనివాసులు తదిత రులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:2.బందోబస్తు పరిశీలించిన ఎస్పి వినీత్ 
______________________

Tags:

About The Author

Latest News