భూత్పూర్ బీబీ మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

భూత్పూర్ బీబీ మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

 

మహబూబ్ నగర్ ఫిబ్రవరి 11 (లోకల్ గైడ్ IMG-20260211-WA0178 వెంకటేష్ గౌడ్)

మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్  విజయేందిర బోయి బుధవారం పరిశీలించారు. 
ఈ సందర్భంగా వార్డు నంబర్ 9లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ నిర్వహణను పరిశీలించారు. అలాగే వార్డు నంబర్ 10లోని ఉర్దూ కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను సమీక్షించారు. వార్డు నంబర్ 06 అమిస్తాపూర్
 ప్రాథమిక పాఠశాలలో, అలాగే వార్డులు 05 , 06 పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు

Tags:

About The Author

Latest News